లాథమ్‌ అజేయ శతకం

Latham's Unbeaten Century Against England In Second Test Match - Sakshi

హామిల్టన్‌: ఓపెనర్‌ లాథమ్‌ (101 బ్యాటింగ్‌; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో న్యూజిలాండ్‌ను ఆదుకున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన ఈ రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 54.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసింది. వర్షం వల్లా చివరి సెషన్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

కివీస్‌ జట్టులో జీత్‌ రావల్‌ (5), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (4) ఆరంభంలోనే నిష్క్రమించారు. ఆ తర్వాత లాథమ్, రాస్‌ టేలర్‌ (53; 8 ఫోర్లు) మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు.  అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న టేలర్‌ను వోక్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. నికోల్స్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులోకి రాగా 173/3 స్కోరు వద్ద రెండో సెషన్‌ ముగిసింది. ఆ తర్వాత ఓ మూడు బంతులే పడగా వర్షం వల్ల ఆట సాధ్యపడలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top