కేకేఆర్ విజయలక్ష్యం 168 | Kings punjab set target of 168 runs | Sakshi
Sakshi News home page

కేకేఆర్ విజయలక్ష్యం 168

May 9 2017 9:49 PM | Updated on Sep 5 2017 10:46 AM

కేకేఆర్ విజయలక్ష్యం 168

కేకేఆర్ విజయలక్ష్యం 168

కోల్ కతా నైట్ రైడర్స్ తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది

మొహాలి:కోల్ కతా నైట్ రైడర్స్ తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ జట్టులో మ్యాక్స్ వెల్(44;25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో పాటు సాహా(38;33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), వోహ్రా(25;16 బంతుల్లో 4 ఫోర్లు)లు ఫర్వాలేదనిపించడంతో కింగ్స్ పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

కింగ్స్  పంజాబ్ కు ఆదిలో శుభారంభం లభించింది. వోహ్రా దాటిగా ఆడి కింగ్స్ స్కోరు ను పరుగులు పెట్టించాడు. కాగా, వోహ్రా అవుటైన తరువాత కింగ్స్ తడబడింది. ఆపై స్వల్ప వ్యవధిలో గప్టిల్, షాన్ మార్ష్ వికెట్లను నష్టపోయింది. కాగా, సాహా-మ్యాక్స్ వెల్ లు ఆదుకోవడంతో కింగ్స్ తిరిగి గాడిలో పడింది. ఓ దశలో మ్యాక్స్ వెల్ సిక్సర్లతో విరుచకుపడటంతో కింగ్స్ స్కోరులో వేగం పెరిగింది. నాల్గో వికెట్ గా మ్యాక్ వెల్ అవుటైన తరువాత సాహా మోస్తరుగా రాణించగా, స్వప్నిల్ సింగ్(2) నిరాశపరిచాడు. కాగా, చివరి ఓవర్లలో రాహుల్ తివాతియా(15 నాటౌట్;8 బంతుల్లో 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 167 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement