క్రిస్‌ గేల్‌ పక్కన పెట్టారు.. | Kings Punjab Leave Out Chris Gayle Agains Delhi Capitals Match | Sakshi
Sakshi News home page

క్రిస్‌ గేల్‌ పక్కన పెట్టారు..

Apr 1 2019 7:50 PM | Updated on Apr 1 2019 7:56 PM

Kings Punjab Leave Out Chris Gayle Agains Delhi Capitals Match - Sakshi

మొహాలి: ఐపీఎల్‌-12లో భాగంగా ఇక్కడ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా కింగ్స్‌ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటికే మూడు మ్యాచ్‌లాడిన ఇరు జట్లూ రెండేసి విజయాలు నమోదు చేశాయి. ఇరు జట్లలోనూ బ్యాట్స్‌మెన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. 

దాంతో అశ్విన్‌ నేతృత్వంలోని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయంపై ధీమాతో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ అమిత్‌ మిశ్రాను తప్పించి పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇదిలా ఉంచితే, కింగ్స్‌ పంజాబ్‌ క్రిస్‌ గేల్‌ను, ఆండ్రూ టైను పక్కన పెట్టింది. వీరి స్థానాల్లో సామ్‌ కరాన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మన్‌లకు తుది జట్టులోకి తీసుకున్నారు.

తుది జట్లు:

కింగ్ప్‌ పంజాబ్‌
రవిచంద్రన్‌ అశ్విన్(కెప్టెన్‌)‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, డేవిడ్‌ మిల్లర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, మన్‌దీప్‌ సింగ్‌, విల్జోయిన్‌, సామ్‌ కరాన్‌, మురుగన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, ముజీబ్‌ ఉర్‌ రెహ్మన్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌
శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, ఇన్‌గ్రామ్‌, హనుమ విహారి, హర్షల్‌ పటేల్‌, క్రిస్‌ మోరిస్‌, లామ్‌చెన్‌, రబడా, అవేశ్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement