సూపర్ క్యాచ్ పట్టిన పొలార్డ్ | Kieron Pollard takes sensational catch to dismiss Kevon Kooper | Sakshi
Sakshi News home page

సూపర్ క్యాచ్ పట్టిన పొలార్డ్

May 19 2014 6:49 PM | Updated on Sep 2 2017 7:34 AM

సూపర్ క్యాచ్ పట్టిన పొలార్డ్

సూపర్ క్యాచ్ పట్టిన పొలార్డ్

ఐపీఎల్-7లో మరో అద్భుతం జరిగింది. ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ అద్భుత ఫీట్ సాధించాడు.

అహ్మదాబాద్: ఐపీఎల్-7లో మరో అద్భుతం జరిగింది. ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ అద్భుత ఫీట్ సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో పొలార్డ్ కళ్లుచెదిరే విన్యాసంతో బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్ పట్టాడు. గ్రేట్ క్యాచ్తో రాజస్థాన్ బ్యాట్స్మన్ కూపర్ను పెవిలియన్ దారి పట్టించాడు.

స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్లో కూపర్ కొట్టిన బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ దాటేలోపు బంతిని పైకెగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ అవతల పడిపోబోయాడు. అయితే చేతిలో ఉన్న బంతిని గ్రౌండ్లోకి విసిరేసి బౌండరీ దాటేశాడు. తర్వాత మళ్లీ మైదానంలోని పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి డ్రైవ్ చేసి మరోసారి క్యాచ్ అందుకున్నాడు. మైదానంలో ఉన్నవారు, టీవీలో మ్యాచ్ చూస్తున్నవారు... పొలార్డ్ విన్యాసంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement