చేతులతో గీటార్ వాయించిన పొలార్డ్ | Kieron Pollard play Guitar with hands | Sakshi
Sakshi News home page

చేతులతో గీటార్ వాయించిన పొలార్డ్

May 25 2014 8:33 PM | Updated on Sep 2 2017 7:50 AM

ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ స్టేడియంలో గీటార్ వాయించాడు. అయితే మీటింది నిజం గీటార్ కాదండోయ్.

ముంబై: ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ స్టేడియంలో గీటార్ వాయించాడు. అయితే మీటింది నిజం గీటార్ కాదండోయ్. తన చేతులను గీటార్ లా పెట్టి వాయించి చూపించాడు. రాజస్థాన్ రాయల్స్ తో ముంబై వాంఖేడ్ మైదానంలో జరుగుతున్న కీలక మ్యాచ్ లో అతడీ విన్యాసం ప్రదర్శించాడు. హర్భజన్ సింగ్ బౌలింగ్ లో రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ ఇచ్చిన క్యాచ్ ను పరుగెత్తికొచ్చి ఒడుపుగా పట్టాడు పొలార్డ్. క్యాచ్ పట్టిన తర్వాత ఒక చేతిని అడ్డంగా పెట్టి, మరో చేత్తో గీటార్ ను మీటుతున్నట్టుగా విన్యాసం చేశాడు. మైదానంలో ఉన్న ప్రేక్షకులు అతడి విన్యాసాన్ని కళ్లప్పగించి చూశారు.

రాజస్థాన్ తోనే జరిగిన గత మ్యాచ్ లోనూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు పొలార్డ్. హర్భజన్ బౌలింగ్ లోనే బౌండరీ లైన్ వద్ద నమ్మశక్యంకాని క్యాచ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement