అంతర్జాతీయ క్రికెట్‌కు ఖుర్రమ్ ఖాన్ వీడ్కోలు | Khurram Khan retires from international cricket | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ క్రికెట్‌కు ఖుర్రమ్ ఖాన్ వీడ్కోలు

Jun 6 2015 1:30 AM | Updated on Sep 3 2017 3:16 AM

యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుకు కీలక బ్యాట్స్‌మన్‌గా సేవలందించిన ఖుర్రమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

దుబాయ్ : యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుకు కీలక బ్యాట్స్‌మన్‌గా సేవలందించిన ఖుర్రమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐసీసీ ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో భాగంగా గురువారం అతడు తన చివరి మ్యాచ్ ఆడాడు. ‘యూఏఈ క్రికెట్ జెంటిల్మెన్’గా పేరు తెచ్చుకున్న 43 ఏళ్ల ఖుర్రమ్ 16 వన్డేల్లో 582 పరుగులు చేసి 12 వికెట్లు తీసుకున్నాడు. అలాగే అత్యంత పెద్ద వయస్సు (43)లో వన్డే సెంచరీ (అఫ్ఘాన్‌పై 132) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 3 టి20ల్లో 73 పరుగులు చేశాడు. గత ప్రపంచకప్‌కు ముందు పదేళ్ల పాటు జట్టు కెప్టెన్‌గా సేవలందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement