breaking news
ICC Intercontinental Cup
-
అంతర్జాతీయ క్రికెట్‌కు ఖుర్రమ్ ఖాన్ వీడ్కోలు
దుబాయ్ : యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుకు కీలక బ్యాట్స్‌మన్‌గా సేవలందించిన ఖుర్రమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐసీసీ ఇంటర్కాంటినెంటల్ కప్‌లో భాగంగా గురువారం అతడు తన చివరి మ్యాచ్ ఆడాడు. ‘యూఏఈ క్రికెట్ జెంటిల్మెన్’గా పేరు తెచ్చుకున్న 43 ఏళ్ల ఖుర్రమ్ 16 వన్డేల్లో 582 పరుగులు చేసి 12 వికెట్లు తీసుకున్నాడు. అలాగే అత్యంత పెద్ద వయస్సు (43)లో వన్డే సెంచరీ (అఫ్ఘాన్‌పై 132) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 3 టి20ల్లో 73 పరుగులు చేశాడు. గత ప్రపంచకప్‌కు ముందు పదేళ్ల పాటు జట్టు కెప్టెన్‌గా సేవలందించాడు. -
చిన్న దేశాలకూ టెస్టు అవకాశం
దుబాయ్ : టెస్టు హోదా దక్కించుకోవాలనే అసోసియేట్ దేశాల కల తొందర్లోనే తీరే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు 2015-17 ఐసీసీ ఇంటర్ కాంటినెంటల్ కప్ వేదిక కానుంది. రౌండ్ రాబిన్ లీగ్‌లో జరిగే ఈ కప్‌లో నెగ్గిన విజేత 2018లో జరిగే ఐసీసీ టెస్టు చాలెంజ్‌లో... ఆఖరి ర్యాంకులో ఉండే టెస్టు జట్టుతో తలపడుతుంది. దీంట్లో భాగంగా వీటి మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో నెగ్గిన అసోసియేట్ జట్టుకు టెస్టు హోదా దక్కుతుంది. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో అఫ్ఘానిస్తాన్, హాంగ్‌కాంగ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, యూఏఈ జట్లు ఆడనున్నాయి. ఈనెల 10 నుంచి 13 వరకు నమీబియా, హాంగ్‌కాంగ్ జట్ల మధ్య నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో ఈ కప్ ఆరంభం కానుంది. 2004లో తొలి ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను స్కాట్లాండ్ గెలుచుకోగా నాలుగు సార్లు (2005, 06-07, 07-08, 11-13) ఐర్లాండ్, 2009-10లో అఫ్ఘాన్ విజేతగా నిలిచింది.