Ross Taylor Retirement: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెట‌ర్‌..

New Zealand batter Ross Taylor to retire from international cricket - Sakshi

న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా గురువారం టేలర్‌ ప్రకటించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు అనంతరం తప్పుకోనున్నట్లు తెలిపాడు.

"ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు ఆడిన తర్వాత తప్పుకుంటాను. 17 సంవత్సరాలపాటు నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు.  నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను" అని టేలర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

కాగా  2006లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో టేలర్‌ అరంగటేట్రం చేశాడు. ఇప్పటి వరకు 233 వన్డేల్లో 8576 పరుగులు చేశాడు. అతడి వన్డే కేరిర్‌లో 21 సెంచరీలు సాధించాడు. అతడు 102 టీ20ల్లో 1909 పరుగులు చేశాడు. ఇక ఇప్పటివరకు 110 టెస్టుల్లో 7585 పరుగులు చేశాడు.

చదవండి: Ind Vs Sa Test Series: దక్షిణాఫ్రికాకు షాక్‌.. నిర్ణయం మార్చుకున్న కీలక ఆటగాడు.. సిరీస్‌కు దూరం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top