చిరుతకు పాలు తాగించిన క్రికెటర్‌ : వైరల్‌ వీడియో

Kevin Pietersen Adopts Baby Leopard Viral Video - Sakshi

మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్‌సన్ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ వైపు కామెంటేటర్‌గా ఉంటూనే ఖాళీ సమయంలో పెంపుడు జంతువులతో గడుపుతున్నారు. ఇటీవల ఓ చిరుత పిల్ల ఎత్తుకొని పాలు తాగిస్తున్న విడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

కెవిన్‌ పీటన్‌సన్‌ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి ఓ చిరుతని ఇటీవల దత్తత తీసుకున్నారు. దానిని ఎత్తుకొని పాలు పట్టిస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఆనందం అంటే ఇదే.. ఈ చిన్నారి చిరుత ఎంత అందంగా ఉందో' అంటూ అందులో పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదేకాకుండా ఓ చిరుత పిల్ల, జింక పిల్లలు కలిసి సరదాగా ఉన్న వీడియో పీటన్‌సన్‌ వారం కిందట పోస్ట్‌ చేశారు. దీంతో జంతు సంరక్షణ కోసం కెవిన్‌ చేపట్టిన చర్యలను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ వీడియోలు జంతు ప్రేమికులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
 

HAPPINESS IN THIS! How beautiful is this baby Leopard????

A post shared by Kevin Pietersen (@kp24) on

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top