కేంద్రం తీరుపై గుత్తా జ్వాల ఫైర్ | jwala gutta slams sports ministry over top scheme | Sakshi
Sakshi News home page

కేంద్రం తీరుపై గుత్తా జ్వాల ఫైర్

Apr 2 2015 7:27 PM | Updated on Sep 2 2017 11:45 PM

కేంద్రం తీరుపై గుత్తా జ్వాల ఫైర్

కేంద్రం తీరుపై గుత్తా జ్వాల ఫైర్

క్రీడామంత్రిత్వ శాఖ తీరుపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మండిపడింది.

క్రీడామంత్రిత్వ శాఖ తీరుపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మండిపడింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం విషయంలో తనను పట్టించుకోకపోవడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించింది. ఇంతకాలం దేశానికి సేవ చేసిన తర్వాత ప్రభుత్వం తనను ఇలా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు గానీ, అశ్వని పేరు గానీ టాప్ పథకంలో లేవన్న విషయం తనకు ఇప్పుడే తెలిసిందని జ్వాల చెప్పింది.

ఇన్నాళ్లూ తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉందనుకున్నామని.. ఇప్పుడు అది కూడా కొడిగట్టిందని తెలిపింది.  ఇప్పటికే కార్పొరేట్ వర్గాల నుంచి కావల్సినంత సపోర్ట్ ఉన్న క్రీడాకారుల పేర్లే అందులో ఉన్నాయి తప్ప, తనను.. అశ్వనిని పట్టించుకోలేదని వాపోయింది. ఇప్పుడు ఇక ఏంచేయాలో అర్థం కావట్లేదని, తాను బాగా అలిసిపోయానని చెప్పింది. డబుల్స్ గేమ్లో ఆడేందుకు తాము చాలా కష్టపడ్డామని, కానీ ఇలా చేస్తారని మాత్రం ఎప్పుడూ ఊహించలేదని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement