కోహ్లిపై ఆస్ట్రేలియా క్రికెటర్‌ మాటల దాడి! | Johnson takes aim at missing Kohli | Sakshi
Sakshi News home page

కోహ్లిపై ఆస్ట్రేలియా క్రికెటర్‌ మాటల దాడి!

Mar 27 2016 1:07 PM | Updated on Sep 3 2017 8:41 PM

కోహ్లిపై ఆస్ట్రేలియా క్రికెటర్‌ మాటల దాడి!

కోహ్లిపై ఆస్ట్రేలియా క్రికెటర్‌ మాటల దాడి!

ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్ మిచేల్ జాన్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నప్పటకీ.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను డామినేట్ చేసే తీరు మాత్రం మార్చుకోలేదు.

ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్ మిచేల్ జాన్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నప్పటకీ.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను డామినేట్ చేసే తీరు మాత్రం మార్చుకోలేదు. టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్‌ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా జాన్సన్‌ ట్విట్టర్‌లో దాడికి దిగాడు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అనగానే సహజంగానే ఆటగాళ్ల మధ్య మాటల పోరు, స్లెడ్జింగ్‌ గుర్తుకొస్తాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ కోహ్లి స్లెడ్జింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని పేర్కొన్నాడు. కంగారులు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి స్లెడ్జింగ్‌లాంటి దానికి పాల్పడితే.. దానిని పాజిటివ్‌ తీసుకొని మరింత స్ఫూర్తి పొందుతానని చెప్పాడు. తానొక దృక్ఫథం తీసుకొని మైదానంలోకి ఎంటరైతే.. ఎవరు ఎలాంటి దానికి పాల్పడినా లెక్కచేయబోనని, తన ప్లాన్స్‌కు అనుగుణంగా ముందుకెళుతానని చెప్పాడు.

కోహ్లి వ్యాఖ్యలను మిచేల్ ట్విట్టర్‌లో ఎద్దేవా చేశాడు. గత ఏడాది జరిగిన వరల్డ్‌ కప్‌ సెమిస్‌ మ్యాచ్‌లో ఎందుకు విఫలమయ్యావంటూ ప్రశ్నించాడు. నిజంగా ఆడాల్సిన ఆ సమయంలో ఒక్క పరుగుకే ఔటైన విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశాడు. 2015 వరల్డ్‌ కప్‌ సెమిస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విసిరిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టాప్ -5 బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌ పేరిట ధోనీ, డివిలీయర్స్‌, స్మిత్‌, రూట్‌, విలియమ్‌సన్‌ పేర్లు ప్రకటించిన మిచేల్‌ ఉద్దేశపూరితంగానే కోహ్లి పేరు మిస్‌ చేశాడు. దీనిపై మిచేల్‌తో కోహ్లి అభిమానులు ట్విట్టర్‌లో పంచాయతీ పెట్టుకున్నారు. అయినా టాప్‌ 5 లిస్ట్‌లో ఆమ్లా పేరును చేర్చాడు కానీ కోహ్లి పేరు చేర్చలేదు అతను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement