జాసన్‌ రాయ్‌ సరికొత్త రికార్డు

Jason Roy smashes the record for the highest ODI score by an England batsman - Sakshi

మెల్‌బోర్న్‌: ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌ తరపున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన  జాసన్‌ రాయ్‌(180;151 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లు) రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా 2016లో పాకిస్తాన్‌పై అలెక్స్‌ హేల్స్‌(171) నెలకొల్సిన అ‍త్యధిక పరుగుల వన్డే రికార్డును రాయ్‌ బ్రేక్‌ చేశాడు. ఆసీస్‌ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ ఆదిలోనే బెయిర్‌ స్టో(14) వికెట్‌ను కోల్పోయింది. కాగా, జాసన్ రాయ్‌ మాత‍్రం తనదైన శైలిలో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా రాయ్‌ నిలిచాడు. రాయ్‌ ధాటికి ఇంగ్లండ్‌ 42 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది.

ఇటీవల యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ 0-4తో కోల్పోయిన సంగతి తెలిసిందే.  అయితే గత వరల్డ్‌ కప్‌ నుంచి చూస్తే ఇంగ్లండ్‌ వన్డేల్లో అద్బుతమైన రికార్డుతో దూసుకుపోతుంది. అప్పట్నుంచి ఏ జట్టు పరంగా చూసినా ఇంగ్లండ్‌ అత్యధిక వన్డే విజయాల్ని ఖాతాలో వేసుకుంది. 53 మ్యాచ్‌లకు గాను 34విజయాలను ఇంగ్లండ్‌ సాధించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top