జైపూర్‌ విజయాల బాట | Jaipur Pink Panthers beat Pune 33-25 | Sakshi
Sakshi News home page

జైపూర్‌ విజయాల బాట

Aug 16 2019 6:00 AM | Updated on Aug 16 2019 6:00 AM

Jaipur Pink Panthers beat Pune 33-25 - Sakshi

అహ్మదాబాద్‌: జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ మళ్లీ విజయాల బాట పట్టింది. తమ చివరి మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిన పింక్‌ పాంథర్స్‌ ఆ షాక్‌ నుంచి త్వరగానే తేరుకున్నట్లు కనిపించింది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 33–25తో పుణేరి పల్టన్‌ను ఓడించింది. జైపూర్‌ స్టార్‌ రైడర్‌ దీపక్‌ నివాస్‌ హుడా మరో సూపర్‌ ‘టెన్‌’తో చెలరేగాడు. పుణే తరఫున పంకజ్‌ మోహిత్‌ 8 పాయింట్లతో రాణించాడు. ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జైపూర్‌... ఎక్కడా తడబాటుకు గురికాలేదు. తమ రైడింగ్‌తో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ... అలాగే పుణే రైడర్లను పట్టేస్తూ దూసుకెళ్లింది. ఇదే జోరులో పుణేని ఆలౌట్‌ చేసి 17–11తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. రెండో అర్ధ భాగంలోనూ దూకుడును కొనసాగించిన జైపూర్‌ సీజన్‌లో 5 విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నేటి మ్యాచ్‌ల్లో యూ ముంబాతో పట్నా పైరేట్స్‌; గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement