హార్దిక్‌-అ‍య్యర్‌ల బ్రొమాన్స్‌ | Iyer And Hardik Pandya's Bromance On Instagram | Sakshi
Sakshi News home page

హార్దిక్‌-అ‍య్యర్‌ల బ్రొమాన్స్‌

Mar 19 2020 11:38 AM | Updated on Mar 19 2020 11:43 AM

Iyer And Hardik Pandya's Bromance On Instagram - Sakshi

న్యూఢిల్లీ: కరోనా' వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఆందోళన ఎక్కువైంది. ప్రపంచ వ్యాప్తంగా ‘షట్‌డౌన్‌’ వాతావరణం కనిపిస్తుండగా ఇది అంతర్జాతీయ క్రికెట్‌పై పెను ప్రభావమే చూపించింది. కరోనాతో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు కాగా..  మరోవైపు వరల్డ్‌లో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌-13 వాయిదా పడింది. ఏప్రిల్‌ 15వ వరకూ వాయిదా పడ్డ ఈ టోర్నీ ఆ తర్వాత కూడా జరుగుతుందనే గ్యారంటీ లేదు. (హార్దిక్‌ చితక్కొట్టుడు మామూలుగా లేదు!)

ఐపీఎల్‌ 2020 వాయిదా పడటంతో భారత ఆటగాళ్లు దాదాపు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా వేగంగా వ్యాప్తిచెందుతుండడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో చాలామంది ఆటగాళ్లు చేసేదేంలేక సోషల్‌ మీడియాలో టైమ్‌ పాస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. 'ఎక్స్‌పెక్టేషన్‌ వర్సెస్‌ రియాలిటీ' అంటూ హార్దిక్‌ పాండ్యాతో కలిసి సరదాగా దిగిన సెల్ఫీని శ్రేయస్‌ పోస్ట్‌ చేశాడు. ఈ ఇద్దరు క్రికెటర్లూ ఇలా బ్రొమాన్స్‌ చేస్తున్న ఫొటోకు కేఎల్‌ రాహుల్‌ పంచ్ ఇచ్చాడు. 'గాయ్స్‌.. మీ చేతులు కడుక్కోండి' అని కామెంట్ పెట్టాడు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఇలా సెటైర్‌ వేశాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement