బౌన్సరా...నా తలకాయ! | Ishant Sharma gets into argument with Sri Lankan Players | Sakshi
Sakshi News home page

బౌన్సరా...నా తలకాయ!

Sep 1 2015 12:09 AM | Updated on Sep 3 2017 8:29 AM

బౌన్సరా...నా తలకాయ!

బౌన్సరా...నా తలకాయ!

రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ జోరును అడ్డుకోలేక లంక బౌలర్లు భంగపడిన వేళ...

మళ్లీ ఇషాంత్ రగడ
కొలంబో:
రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ జోరును అడ్డుకోలేక లంక బౌలర్లు భంగపడిన వేళ...ఇషాంత్ శర్మ మళ్లీ తన ఆగ్రహావేశాలతో వారిని కవ్వించి పుండు మీద కారం చల్లాడు! ఈ సారి పేసర్ దమ్మిక ప్రసాద్ వంతు. చివరి ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్న ఇషాంత్‌కు అతను వరుసగా మూడు బౌన్సర్లు విసిరాడు. కిందికి వంగి వాటిని తప్పించుకున్న ఇషాంత్ బౌలర్ వైపు చిరునవ్వు చిందించాడు. దాంతో ప్రసాద్ మరింత మండిపోగా, తర్వాతి బంతిని సింగిల్ తీసిన శర్మ...మరో బౌన్సర్ వేస్తావా అన్నట్లుగా తన తల వైపు చూపించాడు. అయితే రన్ పూర్తి కాగానే ప్రసాద్ ఏదో అనడంతో ఇషాంత్ బదులిచ్చాడు.

ఇంతలో సీన్‌లోకి వచ్చిన చండీమల్, ఇషాంత్ దగ్గరగా వచ్చి నోరు జారాడు. మరో వైపు ఉన్న అశ్విన్‌తో పాటు అంపైర్లు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఆ వెంటనే కావాలనే ‘నోబాల్’ వేస్తూ ప్రసాద్ మరో బౌన్సర్ వేసినా భారత బౌలర్ ఇబ్బంది పడలేదు. కానీ చివరి బంతికి అశ్విన్ అవుటై అంతా పెవిలి యన్ వెళుతున్న దశలో ప్రసాద్ ముందుకు దూసుకొచ్చి మళ్లీ ఇషాంత్‌పై నోరు జారాడు. అక్కడ కథ ముగిసినా...చండీమల్‌ను అవుట్ చేసి ఇషాంత్ మళ్లీ తనదైన శైలిని ప్రదర్శించాడు. చేత్తో తన తలను బలంగా కొట్టుకుంటూ చండీమల్‌కు సెండాఫ్ ఇచ్చాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement