టాప్-20లో ఇషాంత్, పూజారా | Ishant, Pujara enter top-20 in ICC Test rankings | Sakshi
Sakshi News home page

టాప్-20లో ఇషాంత్, పూజారా

Sep 2 2015 2:03 PM | Updated on Sep 3 2017 8:37 AM

టాప్-20లో ఇషాంత్, పూజారా

టాప్-20లో ఇషాంత్, పూజారా

భారత బౌలర్ ఇషాంత్ శర్మ టెస్టు ర్యాంకుల్లో టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు.

దుబాయ్: భారత బౌలర్ ఇషాంత్ శర్మ టెస్టు ర్యాంకుల్లో టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు.  తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో ఇషాంత్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 18వ ర్యాంకు దక్కించుకున్నాడు. అశ్విన్ 50, అమిత్ మిశ్రా 59  ర్యాంకుల్లో ఉన్నారు.

బ్యాట్స్ మన్ చతేశ్వర్ పూజారా కూడా టాప్-20లో చోటు సంపాదించాడు. నాలుగు స్థానాలు ఎగబాకి 20వ స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో టాప్-20లో ఉన్న రెండో బ్యాట్స్ మన్ పూజారా. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక ర్యాంకు పడిపోయి 11వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగు పరుచుకుని 48వ ర్యాంకులో నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement