సిటీలో టెన్నిస్ సందడి | iptl heat in hyderabad | Sakshi
Sakshi News home page

సిటీలో టెన్నిస్ సందడి

Dec 9 2016 11:13 AM | Updated on Sep 4 2017 10:18 PM

సిటీలో టెన్నిస్ సందడి

సిటీలో టెన్నిస్ సందడి

చలితో వణికిపోతున్న నగర వాసుల్ని అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) మ్యాచ్‌లు వేడెక్కించనున్నాయి.

నేటి నుంచి ఐపీటీఎల్ మ్యాచ్‌లు
 తొలి మ్యాచ్‌లో వారియర్స్‌తో రాయల్స్ ఢీ


 
సాక్షి, హైదరాబాద్: చలితో వణికిపోతున్న నగర వాసుల్ని అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) మ్యాచ్‌లు వేడెక్కించనున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్ స్టార్స్‌తో సిటీలో సందడి మొదలైంది. ఇండియన్ ఏసెస్ తరఫున హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా తొలిసారిగా సొంతగడ్డపై అదరగొట్టేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ అంచె పోటీలు నేటి నుంచి మూడు రోజుల పాటు గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో జరుగనున్నాయి. శుక్రవారం రెండు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. తొలిపోరులో జపాన్ వారియర్స్‌తో యూఏఈ రాయల్స్ ఢీకొంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే రెండో పోరులో ఇండియన్ ఏసెస్‌తో సింగపూర్ స్లామర్స్ తలపడనుంది.

 ‘సానియా’ ఆకర్షణ...

 అంతర్జాతీయ టెన్నిస్‌లో ప్రస్తుతం డబుల్స్‌లో దూసుకెళ్తున్న హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా ఇక్కడ ప్రత్యేకాకర్షణ కానుంది. ఐపీటీఎల్‌లో ఆమె మూడోసారి బరిలోకి దిగుతున్నప్పటికీ సిటీలో మాత్రం ఇదే తొలిసారి. సొంత ప్రేక్షకుల మద్దతుతో ఆమె సింగపూర్ స్లామర్స్‌తో తలపడనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. స్పోర్‌‌ట్స కల్చర్‌కు సిటీ చిరునామాగా మారుతోంది. మరీ ముఖ్యంగా ఇక్కడివారు టెన్నిస్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవుతారు. దాంతో పాటు ఎందరో ప్రతిభావంతులు వివిధ క్రీడల్లో అంతర్జాతీయస్థారుులో సత్తాచాటుతున్నారు’ అని తెలిపింది.

 జట్ల వివరాలు
 జపాన్ వారియర్స్: ఫెర్నాండెజ్ గొంజాలెజ్, జులి యన్ రోజర్, కి నిషికొరి, మారత్ సఫిన్, ఫెర్నాం డో వెర్డాస్కో, జెలెనా జంకోవిచ్, కురిమి నరా.


 యూఏఈ రాయల్స్: అనా ఇవనోవిచ్, ఇవానిసెవిచ్, పాబ్లో క్యూవస్, బెర్డిచ్, డానియెల్ నెస్టర్, మార్టినా హింగిస్, థామస్ జాన్సన్.
 ఇండియన్ ఏసెస్: సానియా మీర్జా, రోహన్ బోపన్న, లోపెజ్, కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌‌స, థామస్ ఎన్‌క్విస్ట్, ఇవాన్ డోడిగ్, మార్క్ ఫిలిప్పోసిస్.
 సింగపూర్ స్లామర్స్: కార్లోస్ మోయా, మార్సెలో మెలో, నిక్ కిరియోస్, కికి బెర్టెన్‌‌స, మార్కస్ బగ్ధాటిస్, రెయినర్ షుట్లర్.

 

Advertisement
 
Advertisement
Advertisement