మ్యాక్స్‌వెల్‌కు భారీ ధర | IPL Auction 2020: Maxwell Sold To Kings For Rs 10.75 Crore | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌వెల్‌కు భారీ ధర

Dec 19 2019 4:12 PM | Updated on Dec 19 2019 4:22 PM

IPL Auction 2020: Maxwell Sold To Kings For Rs 10.75 Crore - Sakshi

కోల్‌కతా: ఆసీస్‌ క్రికెటర్‌ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌-2020 వేలంలో భారీ ధర పలికింది. అతని కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా 10 కోట్లకు పైగా అమ్ముడుపోయాడు. మ్యాక్సీ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీపడగా చివరకూ కింగ్స్‌  పంజాబ్‌ మ్యాక్స్‌వెల్‌ను రూ. 10. 75 కోట్లకు దక్కించుకుంది. గత పలు సీజన్లలో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడిన మ్యాక్సీ మళ్లీ ఆ జట్టుకు ఆడనున్నాడు. తొలి రౌండ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఆల్‌ రౌండర్‌గా రేసులోకి వచ్చాడు.

అతని కోసం బిడ్‌ను కింగ్స్‌ పంజాబ్‌ ఆరంభించి చివరకు వశం చేసుకుంది. ఇక మరో ఆసీస్‌ క్రికెటర్‌ అరోన్‌ ఫించ్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కొనుగోలు చేసింది. ఫించ్‌ కోసం కేకేఆర్‌ తీవ్రంగా పోటీపడినప్పటికీ ఆఖరికి ఆర్సీబీ దక్కించుకుంది. ఫించ్‌ కనీస ధర 1 కోటి ఉండగా, రూ. 4.40 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement