సిమన్స్ సూపర్ సెంచరీ.. ముంబై గ్రాండ్ విన్ | IPL-7: Mumbai beats punjab | Sakshi
Sakshi News home page

సిమన్స్ సూపర్ సెంచరీ.. ముంబై గ్రాండ్ విన్

May 21 2014 11:10 PM | Updated on Sep 2 2017 7:39 AM

కింగ్స్ లెవెన్ పంజాబ్ జోరుకు బ్రేక్ పడింది. ముంబై ఇండియన్స్ ఏడు వికెట్లతో పంజాబ్పై ఘన విజయం సాధించింది.

చండీగఢ్: కింగ్స్ లెవెన్ పంజాబ్ జోరుకు బ్రేక్ పడింది. ముంబై ఇండియన్స్ ఏడు వికెట్లతో పంజాబ్పై ఘన విజయం సాధించింది. ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై మరో .ఆరు బంతులు మిగిలుండగా కేవలం మూడు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. సిమన్స్ 61 బంతుల్లో మెరుపు సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. సిమన్స్ 12 ఫోర్లు, 2 సిక్సర్లతో కనువిందు చేశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ 17, మనన్ వోహ్రా 36 పరుగులు చేశారు. కాగా సూపర్ ఫామ్లో ఉన్న మ్యాక్స్ వెల్ రెండే పరుగులకు వెనుదిరిగాడు. షాన్ మార్ష్ (30), జార్జి బెయిలీ (39) రాణించారు. ముంబై బౌలర్లు శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా  రెండేసి వికెట్లు తీశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement