ధోని మెరుపులు వృథా

IPL 2019 RCB Beat CSK In Thriller At Chinnaswamy Stadium Bangalore - Sakshi

48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 నాటౌట్‌

చివరి బంతికి గెలిచిన బెంగళూరు

పోరాడి ఓడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఆకట్టుకున్న పార్థివ్‌ పటేల్‌  

బెంగళూరుకు తొలిసారి అదృష్టం కలిసి వచ్చింది. చివరి బంతికి గెలుపు రుచి చూసింది. విజయానికి 6 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన స్థితిలో చెన్నై గెలుపు అసాధ్యమే అనుకున్నారంతా... కానీ ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఆఖరి ఓవర్లో ధోని వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 2, 6తో 24 పరుగులు పిండుకున్నాడు. ఉత్కంఠ తారాస్థాయికి చేరగా... చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని షాట్‌ గురి తప్పడం... పరుగు కోసం ప్రయత్నించడం... బెంగళూరు కీపర్‌ పార్థివ్‌ డైర్టెక్‌ హిట్‌తో శార్దుల్‌ను రనౌట్‌ చేయడం... బెంగళూరు విజయం ఖాయమవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ గెలుపుతో ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఎదురైన ఓటమికి బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది.

బెంగళూరు: పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరోసారి బతికిపోయింది. సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆఖరి బంతికి ఒక పరుగు తేడాతో ‘టేబుల్‌ టాపర్‌’ చెన్నై సూపర్‌ కింగ్స్‌పై గెలుపొంది లీగ్‌లో మూడో విజయాన్ని దక్కించుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పార్థివ్‌ పటేల్‌ (37 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ కోహ్లి (9), ఏబీ డివిలియర్స్‌ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించలేకపోయారు. మొయిన్‌ అలీ (16 బంతుల్లో 26; 5 ఫోర్లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. ధోని (48 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌ వృథా అయింది.  

ఏబీ, కోహ్లి విఫలం... 
అరుదైన రీతిలో కెప్టెన్‌ కోహ్లి... ‘మిస్టర్‌ 360’ ఏబీ డివిలియర్స్‌ తక్కువ స్కోరుకే పరిమితం కాగా పార్థివ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అక్ష్‌దీప్‌ నాథ్‌ (20 బంతుల్లో 24, ఫోర్, సిక్స్‌), స్టొయినిస్‌ (14) పరవాలేదనిపించారు. క్రీజులోకి వస్తూనే బౌండరీతో దూకుడు కనబరిచిన అలీ చివర్లో విలువైన పరుగుల్ని జోడించాడు.   

నిలిచిన పార్థివ్‌...  
రాయల్‌ చాలెంజర్స్‌ ఇన్నింగ్స్‌ను ఈసారి ఓపెనర్‌ పార్థివ్‌ నిలబెట్టాడు. ఠాకూర్‌ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన అతను జడేజా బౌలింగ్‌లోనూ డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా మరో సిక్సర్‌తో అలరించాడు. తాహిర్‌ బౌలింగ్‌లో మరో సిక్స్‌తో జోరు పెంచాడు. సింగిల్స్‌తో స్ట్రయిక్‌ రొటేట్‌ చేసిన అతను వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరును పెంచాడు. బ్రేవో బౌలింగ్‌ (16వ ఓవర్‌)లో బౌండరీ బాది మరుసటి బంతికి ఔటయ్యాడు. 

ధోని అర్ధసెంచరీ...  
లక్ష్యఛేదనలో చెన్నై టాపార్డర్‌ విఫలమైంది. వాట్సన్‌ (5), డు ప్లెసిస్‌ (5), రైనా (0) క్రీజులో నిలవలేకపోయారు. జాదవ్‌ (9) కూడా నిరాశ పరచడంతో 28 పరుగులకే 4 కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడు, ధోని ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ ధోని స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. ఉమేశ్‌ బౌలింగ్‌లో 6, 4తో జోరు పెంచిన రాయుడును చహల్‌ ఔట్‌ చేశాడు. ఈ దశలో ధోని, జడేజా (12 బంతుల్లో 11) సింగిల్స్‌ తీయడంతో స్కోరు వేగం మందగించింది. 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ధోని జట్టును గెలిపించేందుకు తీవ్రంగా కృషిచేశాడు. జడేజా, బ్రేవో (5) పెవిలియన్‌ చేరినా... ధోని చివరి వరకు పోరాడాడు. కానీ విజయాన్ని అందించలేకపోయాడు.   

మరిన్ని వార్తలు

17-05-2019
May 17, 2019, 18:53 IST
టీడీపీ కోరిన 18 చోట్ల కూడా వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నామని చెప్పారు.
17-05-2019
May 17, 2019, 18:44 IST
ఐపీఎల్‌ సమరం ముగిసింది మరి నెక్ట్స్‌ ఏంటి? అంటే ఇంకేంటి ప్రపంచకప్‌ కదా అంటున్నారు టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు.
16-05-2019
May 16, 2019, 16:02 IST
వెల్లింగ్టన్‌: ఐపీఎల్‌-12వ సీజన్‌ ముగిసి నాలుగు రోజులు అయ్యింది. అయినప్పటికీ ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌...
16-05-2019
May 16, 2019, 04:53 IST
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశ వేడెక్కింది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ర్యాలీలో జరిగిన...
15-05-2019
May 15, 2019, 19:18 IST
రాబోయే రోజుల్లో కోహ్లి తర్వాత భారత జట్టుకు అతనే సరైనోడు..
15-05-2019
May 15, 2019, 00:45 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫైనల్‌ మ్యాచ్‌ వెబ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘హాట్‌ స్టార్‌’లో సూపర్‌ హిట్టయింది. ముంబై ఇండియన్స్, చెన్నై...
14-05-2019
May 14, 2019, 19:39 IST
నేను ముంబై ఇండియన్స్‌ అభిమానిని. కానీ వాట్సన్‌ ఆట, అంకితభావం చూశాక అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.
14-05-2019
May 14, 2019, 18:33 IST
థర్డ్‌ అంపైర్‌ తన ఖాతాలో డబ్బులు పడేంత వరకూ ఎదురుచూసి.. ఆ తర్వాత ధోనీని ఔట్‌గా ప్రకటించాడు
14-05-2019
May 14, 2019, 16:57 IST
రక్తం కారుతున్నా.. బ్యాటింగ్‌ చేసిన వాట్సన్‌
14-05-2019
May 14, 2019, 15:59 IST
ముంబై : ప్రస్తుత యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కరే స్ఫూర్తి. అతడి ఆటను...
14-05-2019
May 14, 2019, 13:51 IST
హైదరాబాద్‌: హార్దిక్‌ పాం‍డ్యా, కేఎల్‌ రాహుల్‌ మధ్య ఉన్న దోస్తీ గురించి తెలిసిందే. వీరిద్దరు కలిసి కరణ్‌ జోహార్‌ ‘కాఫీ...
14-05-2019
May 14, 2019, 00:11 IST
ఈ ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు ఆఖరి ఓవర్‌దాకా సాగి ఉత్కంఠ రేపాయి. ప్రేక్షకుల్ని చివరిదాకా కుర్చీలకు అతుక్కుపోయేలా చేశాయి. తాజా...
14-05-2019
May 14, 2019, 00:07 IST
సాక్షి క్రీడావిభాగం : ముంబై ఇండియన్స్‌ పేసర్‌ అల్జారి జోసెఫ్‌ ఈ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లు ఆడి గాయంతో టోర్నీకి...
13-05-2019
May 13, 2019, 20:40 IST
హైదరాబాద్‌: సమష్టి కృషితోనే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12 ట్రోఫీని ముంబై ఇండియన్స్‌ కైవసం చేసుకుందని ఆ జట్టు...
13-05-2019
May 13, 2019, 19:40 IST
కేవలం ఒకే ఒక్క పరుగుతో టైటిల్‌ కోల్పోవడం తన హార్ట్‌ను బ్రేక్‌ చేసింది.ధోని ఇంతలా బాధపడటం..
13-05-2019
May 13, 2019, 19:16 IST
బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నీతా అంబానీ
13-05-2019
May 13, 2019, 18:26 IST
హైదరాబాద్‌: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌...
13-05-2019
May 13, 2019, 17:11 IST
హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక సమయాలలో బ్యాట్స్‌మెన్‌ రనౌట్‌లు అవడం చెన్నై సూపర్‌కింగ్స్‌...
13-05-2019
May 13, 2019, 16:38 IST
హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12 ఫైనల్‌ పోరులో అంతిమ విజయం ముంబే ఇండియన్స్‌కే దక్కింది. ఆదివారం ఉప్పల్‌...
13-05-2019
May 13, 2019, 10:51 IST
సాక్షి, హైదరాబాద్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top