ప్రధాన కోచ్‌గా బంగర్ | Indian team's batting coach Sanjay bunger | Sakshi
Sakshi News home page

ప్రధాన కోచ్‌గా బంగర్

May 27 2016 12:39 AM | Updated on Sep 4 2017 12:59 AM

ప్రధాన కోచ్‌గా బంగర్

ప్రధాన కోచ్‌గా బంగర్

భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌కు రాబోయే సిరీస్ కోసం ప్రమోషన్ లభించింది. జింబాబ్వేలో పర్యటించే టీమిండియాకు ఆయన ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారు.

జింబాబ్వే పర్యటనకు ఎంపిక ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మ


ముంబై: భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌కు రాబోయే సిరీస్ కోసం ప్రమోషన్ లభించింది. జింబాబ్వేలో పర్యటించే టీమిండియాకు ఆయన ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారు. భారత్‌కు కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా ఈ సిరీస్ వరకు బంగర్‌కు బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఇప్పటి వరకు పని చేసిన ఆర్.శ్రీధర్‌ను బోర్డు తప్పించింది.


అతని స్థానంలో ఢిల్లీకి చెందిన అభయ్ శర్మను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. రైల్వేస్‌కు, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కు కోచ్‌గా వ్యవహరించిన అభయ్... భారత అండర్-19, భారత ‘ఎ’ జట్లకు ఇటీవలి వరకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశారు. జింబాబ్వే పర్యటనకు భారత జట్టు మేనేజర్‌గా కోకా రమేశ్ (ఆంధ్ర)ను ఎంపిక చేశారు. టూర్‌లో ధోని సారథ్యంలోని భారత జట్టు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement