భారత షూటర్లకు మళ్లీ నిరాశ | Indian shooters disappoint again | Sakshi
Sakshi News home page

భారత షూటర్లకు మళ్లీ నిరాశ

Feb 27 2017 1:05 AM | Updated on Sep 5 2017 4:41 AM

సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో మూడో రోజు భారత షూటర్లకు నిరాశే ఎదురైంది.

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో మూడో రోజు భారత షూటర్లకు నిరాశే ఎదురైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో సంజీవ్‌ రాజ్‌పుత్‌ ఐదో స్థానాన్ని సాధించగా... మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో హర్వీన్‌ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్స్‌లో సంజీవ్‌ 420.6 పాయింట్లు, హర్వీన్‌ 133.6 పాయింట్లు స్కోరు చేశారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ హీనా సిద్ధూ క్వాలిఫయింగ్‌లో 378 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైంది.

Advertisement
 
Advertisement
Advertisement