కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ బాక్సర్ గౌరవ్ సోలంకి- వెండి పతకం గెల్చుకున్నాడు.
అపియా: కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ బాక్సర్ గౌరవ్ సోలంకి- వెండి పతకం గెల్చుకున్నాడు. 52 కిలోల విభాగంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్ జాక్ బొవెన్ చేతిలో 0-3 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో అతడికి వెండి పతకం దక్కింది. ఈ టోర్నిలో భారత్ తరపున గౌరవ్ సోలంకి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.
ఇదే విభాగంలో 49 కిలోల కేటగిరిలో భీంచంద్ సింగ్, 64 కిలోల విభాగంలో ప్రజ్ఞాన్ చౌహాన్ సెమీస్ లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. బాక్సింగ్ లో భారత్ కు మొత్తం మూడు పతకాలు దక్కాయి.