జింబాబ్వేతో సోమవారమిక్కడ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
హరారే: జింబాబ్వేతో సోమవారమిక్కడ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణంగా చల్లగా ఉండడంతో 10 నిమిషాలు ఆలస్యంగా టాస్ వేశారు. టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
జింబాబ్వే టీమ్ లో ఒక మార్పు జరిగింది. క్రెయిగ్ ఎర్విన్ స్థానంలో సీన్ విలియమ్స్ జట్టులోకి వచ్చాడు. శనివారం జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేను చిత్తు చేసిన ధోని సేన ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది.