విజేత భారత్‌   | India Won The Junior Womens Hockey Tournament | Sakshi
Sakshi News home page

విజేత భారత్‌  

Dec 9 2019 3:05 AM | Updated on Dec 9 2019 3:05 AM

India Won The Junior Womens Hockey Tournament - Sakshi

కాన్‌బెర్రా (ఆ్రస్టేలియా): మూడు దేశాల జూనియర్‌ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన చివరి రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–2 గోల్స్‌ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లో భారత్, ఆసీస్‌ 7 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్‌ సగటు ఆధారంగా భారత్‌కు (+4) టైటిల్‌ ఖాయంకాగా... ఆసీస్‌ (+1) రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచిన భారత్‌... ఒకదాంట్లో ఓడి మరొక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. న్యూజిలాండ్‌ మూడో స్థానంలో నిలిచింది. టోర్నీ మొత్తం అదరగొట్టిన యువ భారత్‌ చివరి మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 1–2తో ఓడిపోయింది. ఆసీస్‌ తరఫున ఎబిగైల్‌ విల్సన్‌ రెండు గోల్స్‌ చేయగా... భారత్‌కు గగన్‌దీప్‌ ఒక గోల్‌ అందించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement