నదీమ్‌కు కలిసొచ్చిన అదృష్టం.. రాంచీ టెస్టులో అరంగేట్రం

India Vs South Africa 3rd Test Shahbaz Nadeem Makes His Debut - Sakshi

రాంచీ: అదృష్టం అంటే ఇదేనేమో. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో చివరి టెస్టులో తలబడబోయే భారత జట్టులో స్పిన్నర్‌ షాబాద్‌ నదీమ్‌ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. అసలు మూడు టెస్టుల సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో నదీమ్‌ సభ్యుడు కాదు. అయితే శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ గాయపడటంతో ఆగమేఘాల మీద నదీమ్‌ను జట్టులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా రాంచీ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇషాంత్‌ శర్మ స్థానంలో నదీమ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. దీంతో నదీమ్‌ టెస్టుల్లో అరంగేట్రానికి మార్గం సుగుమమైంది. సారథి విరాట్‌ కోహ్లి టెస్టు క్యాప్‌ను నదీమ్‌కు అందించాడు. ఇది అంతా కల లేక మాయగా ఉందని నదీమ్‌ కుటుంబసభ్యులు, అభిమానులు పేర్కొంటున్నారు. ఇలా అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకోవడం క్రికెట్‌ చాలా అరుదుగా జరుగుతాయి. 

శనివారం నుంచి ప్రారంభమైన భారత్‌-సఫారీల తుది టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సారథి విరాట్‌ కోహ్లి ఏ మాత్రం ఆలోచించకుండా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అంతేకాకుండా జట్టులో ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఇషాంత్‌ను పక్కకు పెట్టి నదీమ్‌ను తీసుకోవడం మినహా పెద్ద మార్పులు జరగలేదు. ఇక టాస్‌ విషయంలో డుప్లెసిస్‌కు మరోసారి అదృష్టం కలిసిరాలేదు. ముందుగా ప్రకటించనట్టుగానే సారథి డుప్లెసిస్‌తో పాటు బవుమా టాస్‌ వేయడానికి వచ్చాడు. అయిన్నప్పటికీ సఫారీ జట్టును టాస్‌ వెక్కిరించింది. దీంతో వరుసగా ఏడు టెస్టుల్లోనూ డుప్లెసిస్‌ నాయకత్వంలోని సఫారీ జట్టు టాస్‌ ఓడిపోయింది. ఇక సఫారీ జట్టులోనూ పలు మార్పులు జరిగాయి. 

ఇక ఈ టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఏ మాత్రం ఆలోచించకుండా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఇషాంత్‌ను పక్కకు పెట్టి నదీమ్‌ను తీసుకోవడం మినహా జట్టులో పెద్ద మార్పులు జరగలేదు. ఇక టాస్‌ విషయంలో డుప్లెసిస్‌కు మరోసారి అదృష్టం కలిసిరాలేదు. ముందుగా ప్రకటించనట్టుగానే సారథి డుప్లెసిస్‌తో పాటు బవుమా టాస్‌ వేయడానికి వచ్చాడు. అయిన్నప్పటికీ సఫారీ జట్టును టాస్‌ వెక్కిరించింది. దీంతో వరుసగా ఏడు టెస్టుల్లోనూ డుప్లెసిస్‌ నాయకత్వంలోని సఫారీ జట్టు టాస్‌ ఓడిపోయింది. ఇక సఫారీ జట్టులోనూ పలు మార్పులు జరిగాయి. ఈ సిరిస్‌లో వరుస వైఫల్యాలతో విఫలమవుతున్న డిబ్రూయిన్‌, ముత్తుసామి, ఫిలాండర్, మహరాజ్‌లను సఫారీ జట్టు పక్కుకు పెట్టింది. వీరి స్థానంలో జార్జ్ లిండే, హెన్రిచ్‌ క్లాసెన్, లుంగిడి ఎన్‌గిడి, పీట్‌లను తుది జట్టులోకి తీసుకుంది. అంతేకాకుండా ఈ టెస్టులో డికాక్‌ ఓపెనర్‌గా వస్తాడని డుప్లెసిస్‌ ప్రకటించాడు. 

ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటున్న డుప్లెసిస్‌ సేన అందకు అనుగుణంగా జట్టు కూర్పులో పెను మార్పులు చేసింది. డికాక్‌ సేవలను కేవలం బ్యాటింగ్‌కే వాడుకోవాలని భావించి స్పెషలిస్ట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అంతేకాకుండా టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచేవిధంగా అయిదుగురు బౌలర్లతో చివరి టెస్టు బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో సఫారీ స్పిన్నర్‌ జార్డ్‌ లిండే టెస్టు అరంగేట్రం చేశాడు.  

తుది జట్లు
భారత్‌ : కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, రవీంద్ర జడేజా, అశ్విన్, షమీ, ఉమేశ్, నదీమ్‌
దక్షిణాఫ్రికా : డు ప్లెసిస్‌ (కెప్టెన్), ఎల్గర్, హమ్జా, హెన్రిచ్‌ క్లాసెన్, బవుమా, డి కాక్, అన్రిచ్ నార్ట్జే, జార్జ్ లిండే, రబడ, పీట్, ఇన్‌గిడి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top