తొలి టెస్టు:  రోహిత్‌ హాఫ్‌ సెంచరీ.. 

India Vs South Africa 1st Test Rohit Sharma Hits Fifty - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఆకట్టుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో విశాఖలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ గెలిచి టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎన్నో అంచనాల మధ్య ఓపెనర్‌గా మైదానంలో అడుగుపెట్టిన రోహిత్‌.. ఆరంభంలో ఆచితూచి ఆడాడు. అనంతరం తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ రోహిత్‌కు చక్కటి సహకారాన్ని అందించాడు. 

ఈ క్రమంలో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన తొలి మ్యాచ్‌లోనే అర్దసెంచరీ పూర్తి చేయడం విశేషం. ఓపెనర్లు రాణించడంతో లంచ్‌ విరామం వరకు టీమిండియా 30 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ(52 బ్యాటింగ్‌; 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మయాంక్‌ అగర్వాల్‌(39 బ్యాటింగ్‌; 96 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్‌) క్రీజులో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top