నాలుగో వన్డే: టాస్‌ గెలిచిన భారత్‌

India Vs Australia Fourth ODI India Won The Toss Choose Bat First - Sakshi

మొహాలి: ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 తేడాతో ముందజలో ఉండగా.. ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు భారత్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను ఖతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో  ధోని స్థానంలో యువ బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌కు భారత జట్టులో చోటు కల్పించారు.

జట్లు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్, కేఎల్‌ రాహుల్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చహల్‌, బుమ్రా.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కోంబ్,  మ్యాక్స్‌వెల్, ఆస్టాన్‌ టర్నర్‌, క్యారీ, రిచర్డ్సన్, కమిన్స్, జాసన్ బెహ్రండోర్ఫ్, జంపా.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top