నేడు భారత్, కివీస్ మహిళల తొలి వన్డే | India today, the first day of the women Kiwis | Sakshi
Sakshi News home page

నేడు భారత్, కివీస్ మహిళల తొలి వన్డే

Jun 28 2015 1:05 AM | Updated on Sep 3 2017 4:28 AM

నేడు భారత్, కివీస్ మహిళల తొలి వన్డే

నేడు భారత్, కివీస్ మహిళల తొలి వన్డే

మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు నేటి (ఆదివారం) నుంచి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.

బెంగళూరు : మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు నేటి (ఆదివారం) నుంచి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌లన్నీ చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతాయి. తొలిసారిగా వీటిని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే జట్టుకు ఎంపికైన తెలుగమ్మాయి 19 ఏళ్ల కల్పన వికెట్ కీపర్‌గా అరంగేట్రం చేయనుంది. అటు కివీస్ జట్టు తమ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ను 97 పరుగుల తేడాతో ఓడించి జోష్ మీదుంది.

Advertisement
 
Advertisement
Advertisement