భారత్‌ టాప్‌ ర్యాంక్‌ సుస్థిరం 

India snatch ICC ODI top rank from South Africa after 4-1 series win - Sakshi

దుబాయ్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకున్న భారత్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌  ప్రకటించిన వన్డే తాజా ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని పటిష్టం చేసుకుంది. మంగళవారం జరిగిన ఐదో వన్డేలో విజయం సాధించిన భారత్‌ 122 ర్యాంకింగ్‌ పాయింట్లతో తొలి స్థానంలో ఉంది.

ఈ సిరీస్‌కు ముందు 119 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉన్న టీమిండియా నాలుగు వన్డేల్లో విజయాలు సాధించి అగ్రస్థానానికి చేరుకుంది. సిరీస్‌లోని చివరి వన్డేలో కోహ్లి సేన ఓటమి పాలైనా 121 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. మరోవైపు జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో జోరుమీదున్న అఫ్గానిస్తాన్‌ తొలిసారి టాప్‌–10లో చోటు దక్కించుకుంది.    

Back to Top