కివీస్కు కష్టమే?

కివీస్కు కష్టమే?


విశాఖ:న్యూజిలాండ్తో ఇక్కడ జరుగుతున్న చివరి వన్డేలో భారత్ నిర్దేశించిన లక్ష్యం 270.  ఇది ఛేదించే లక్ష్యమే అయినప్పటికీ,  ప్రస్తుత వాతావరణం, పిచ్ కండిషన్ను బట్టి చూస్తే కివీస్కు అంత ఈజీ కాదనే అనిపిస్తోంది. మరి ఈ లక్ష్యాన్ని కివీస్ సాధిస్తుందా? లేక భారత్ తన స్కోరును కాపాడుకుని సిరీస్ను కైవసం చేసుకుంటుందా? అనేది చూడాల్సిందే.



టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ జట్టుకు రోహిత్ శర్మ-అజింక్యా రహానేలు జోడి మంచి ఆరంభాన్ని అందించారు. కాగా, రహానే(20) తొలి వికెట్గా వెనుదిరిగినా, రోహిత్-విరాట్ కోహ్లిల జోడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఈ జోడి 79 పరుగుల భాగస్వామ్యం జోడించిన తరువాత రోహిత్ శర్మ (70;65 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లు)రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై విరాట్-కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిల జోడి స్కోరు బోర్డులో వేగం పెంచింది.


 


అయితే ధోని(41;59 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్) హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో సాంట్నార్ బౌలింగ్లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఆ తరువాత క్రీజ్లోకి వచ్చిన మనీష్ పాండే డకౌట్గా అవుటయ్యాడు. మరికొద్ది సేపటికి విరాట్(65;76 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా నిష్ర్కమించడంతో భారత స్కోరు బోర్డులో వేగం కాస్త తగ్గింది.  చివరి 10 ఓవర్లలో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(24), కేదర్ జాదవ్(39) ఫర్వాలేదనిపించడంతో భారత జట్టు 50.0 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, సోథీ తలో రెండు వికెట్లు సాధించగా, నీషమ్, సాంట్నార్లకు చెరో వికెట్ కు దక్కింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top