మెయిడిన్ తో ఆరంభించారు.. | india put pressure on pakistan | Sakshi
Sakshi News home page

మెయిడిన్ తో ఆరంభించారు..

Jun 18 2017 3:13 PM | Updated on Sep 5 2017 1:56 PM

మెయిడిన్ తో ఆరంభించారు..

మెయిడిన్ తో ఆరంభించారు..

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత్ జట్టు మెయిడిన్ ఓవర్ తో ఆరంభించింది.

లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న ఫైనల్ పోరును భారత్ జట్టు మెయిడిన్ ఓవర్ తో ఆరంభించింది. తొలి ఓవర్ ను వేసిన భువనేశ్వర్ కుమార్ తన మొదటి ఓవర్లో పరుగులేమీ ఇవ్వకుండా మెయిడిన్ వేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి .. ముందుగా పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. 

 

దాంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ ను అజహర్ అలీ, ఫకార్ జమాన్ లు ఆరంభించారు. ఈ ఇద్దరూ పాకిస్తాన్ కీలకం కావడంతో ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లే  యత్నం చేస్తున్నారు. అంతిమ సమరంలో భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమవుతుండగా, పాకిస్తాన్ మాత్రం ఒక మార్పు చేసింది. పేసర్ మొహ్మద్ అమిర్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement