
భారీ స్కోరు దిశగా టీమిండియా
న్యూజిలాండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
విశాఖ: న్యూజిలాండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు 30.0ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత జట్టులో రోహిత్ శర్మ(70;65 బంతుల్లో5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించగా, అజింక్యా రహానే(20) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు.
తొలి వికెట్కు రహానే అవుటైన తరువాత రోహిత్-విరాట్ కోహ్లిల జోడి స్కోరును ముందకు తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే రోహిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లితో కలిసి 79 పరుగులు జోడించిన రోహిత్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. గత నాలుగు వన్డేల్లో కలుపుకుని 53 పరుగులే చేసిన రోహిత్.. కీలకమైన ఈ మ్యాచ్లో మాత్రం ఆకట్టుకున్నాడు. రోహిత్ అవుటైన తరువాత విరాట్తో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జత కలవడంతో పరుగుల వేగం ఊపందుకుంది.