విజయం కోసం... 

India match Australia with women today - Sakshi

నేడు ఆస్ట్రేలియా మహిళలతో భారత్‌ మ్యాచ్‌ 

వడోదర: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌ తొలి వన్డేలో ఓటమి పాలైన భారత మహిళల జట్టు నేడు జరుగనున్న రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అస్వస్థత కారణంగా తొలి వన్డేకు దూరమైన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.

తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిం గ్‌లో సమష్టిగా విఫలమైన భారత్‌ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. గురువారం జరుగనున్న మ్యాచ్‌లో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఉదయం గం. 9.00 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement
Advertisement
Back to Top