డేవిస్‌ కప్‌ జట్టులో మార్పులు 

India Changes in the Davis Cup team - Sakshi

తప్పుకున్న యూకీ, దివిజ్, నాగల్‌ 

సాకేత్‌కు అవకాశం

న్యూఢిల్లీ:  ప్రతిష్టాత్మక డేవిస్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టులో అనూహ్యంగా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన జట్టు నుంచి యూకీ బాంబ్రీ, దివిజ్‌ శరణ్, సుమీత్‌ నాగల్‌ తప్పుకున్నారు. సెప్టెంబర్‌ 14 నుంచి క్రాలేవోలో సెర్బియాతో ఈ పోరు జరుగనుంది.

యూకీ బాంబ్రీ, దివిజ్‌ శరణ్‌లు గాయాల కారణంగా దూరం కాగా... సుమీత్‌ మాత్రం స్టాండ్‌బైగా జట్టుతో పాటు కొనసాగడం ఇష్టం లేక తప్పుకున్నాడు. దీంతో తెలుగు తేజం సాకేత్‌ మైనేనితో పాటు  శ్రీరామ్‌ బాలాజీ వారీ స్థానాలను భర్తీ చేయ నున్నారు. అర్జున్‌ ఖడే స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. 2014లో బెంగళూరులో సెర్బియాతోనే జరిగిన డేవిస్‌కప్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–3తో ఓడింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top