శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ లీడ్ దిశగా సాగుతోంది. లోయర్ ఆర్డర్ రాణించడంతో బారత్ 350 పరుగుల లీడ్ దిశగా సాగుతోంది. టీ విరామ సమయానికి 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.
శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ లీడ్ దిశగా సాగుతోంది. లోయర్ ఆర్డర్ రాణించడంతో బారత్ 350 పరుగుల లీడ్ దిశగా సాగుతోంది. టీ విరామ సమయానికి 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. దీంతో మూడో టెస్ట్ లో ఓవరాల్ లీడ్ 345 పరుగులకు చేరింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, స్టువర్ట్ బిన్నీలు ఒక మోస్తరు పరుగులు చేయడంతో పాటు... లోయర్ ఆర్డర్ లో నమన్ ఓజా, అమిత్ మిశ్రాలు రాణించారు. ప్రస్తుతం అశ్విన్ 27 పరుగలతో నాటౌట్ గా ఉన్నాడు.