టీమిండియాకు షాకిచ్చిన కాట్రెల్‌ | Ind Vs WI: Cottrell Strikes Twice To Hurt India | Sakshi
Sakshi News home page

టీమిండియాకు షాకిచ్చిన కాట్రెల్‌

Dec 15 2019 2:17 PM | Updated on Dec 15 2019 9:38 PM

Ind Vs WI: Cottrell Strikes Twice To Hurt India - Sakshi

చెన్నై:  వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలోనే వరుస విరామాల్లో రెండు వికెట్లు కోల్పోయింది.  తొలి వికెట్‌గా కేఎల్‌ రాహుల్‌(6) ఔట్‌ కాగా, రెండో వికెట్‌గా విరాట్‌ కోహ్లి(4) పెవిలియన్‌ చేరాడు. ఈ రెండు వికెట్లను విండీస్‌ పేసర్‌ కాట్రెల్‌ సాధించి టీమిండియాకు షాకిచ్చాడు.  ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌ను ఔట్‌ చేసిన కాట్రెల్‌.. ఆ ఓవర్‌ చివరి బంతికి కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు.(ఇక్కడ చదవండి: వన్డేల్లో శివం దూబే అరంగేట్రం)

122 కి.మీ వేగంతో కాట్రెల్‌ వేసిన బంతిని స్క్వేర్‌ లెగ్‌లోకి రాహుల్‌ ఆడబోయాడు. అయితే అది కాస్తా ఎడ్జ్‌ తీసుకోవడంతో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న హెట్‌మెయిర్‌ చేతుల్లో పడింది. దాంతో జట్టు స్కోరు 21 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ను నష్టపోయింది. ఇక కోహ్లిది బ్యాడ్‌ లక్‌ అనే చెప్పాలి. ఫోర్‌ కొట్టి ఊపు మీద ఉన్న కోహ్లిని కాట్రెల్‌ చక్కటి బంతితో పెవిలియన్‌కు పంపాడు. కాట్రెల్‌ తక్కువ ఎత్తులో వేసిన బంతిని థర్డ్‌ మ్యాన్‌ దిశగా పంపాలని కోహ్లి యత్నించగా అది కాస్తా మిస్‌ కావడంతో వికెట్లపైకి దూసుకుపోయింది. దాంతో జట్టు స్కోరు 25 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ను నష్టపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఫలితంగా తొలుత టీమిండియా బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement