ఎంత పనిచేశావ్‌ స్మిత్‌..

IND Vs AUS: Australia Lose Openers In PowerPlay - Sakshi

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా 10 ఓవర్లు ముగియకుండానే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. మహ్మద్‌ షమీ వేసిన నాల్గో ఓవర్‌ రెండో బంతికి డేవిడ్‌ వార్నర్‌(3) వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్‌ స్మిత్‌.. అరోన్‌ ఫించ్‌కు జత కలిశాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతున్నారనుకునే సమయంలో స్మిత్‌ చేసిన పొరపాటు ఫించ్‌ వికెట్‌ను బలి తీసుకుంది. షమీ వేసిన 9వ ఓవర్‌ ఐదో బంతికి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లోకి ఆడిన స్మిత్‌.. సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. ఫించ్‌ను పరుగు కోసం రమ్మంటూ పిలిచాడు. 

అయితే తన నిర్ణయాన్ని సెకన్ల వ్యవధిలో మార్చుకున్న స్మిత్‌ వెంటనే స్ట్రైకింగ్‌ ఎండ్‌లోకి దూకేశాడు. అయితే ఫీల్డర్‌ రవీంద్ర జడేజా స్టైకింగ్‌ ఎండ్‌లోకి బంతిని విసిరి స్మిత్‌ రనౌట్‌ కోసం యత్నించాడు. ఆ సమయంలో స్మిత్‌ రనౌట్‌ నుంచి తప్పించుకున్నప్పటికీ ఫించ్‌ పిచ్‌ మధ్యలోకి వచ్చేశాడు. మళ్లీ తిరిగి నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లోకి వెళ్లే ప‍్రయత్నం చేసినా అప్పటికే బంతిని అందుకున్న శ్రేయస్‌ అయ్యర్‌.. బౌలర్‌ షమీకి అందించాడు. అంతే బంతిని అందుకున్న వెంటనే షమీ వికెట్లను పడగొట్టడంతో ఫించ్‌ రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. స్మిత్‌ చేసిన తప్పిదానికి తన వికెట్‌ను కోల్పోవడంతో ఫించ్‌ తిట్టుకుంటూ మైదానాన్ని వీడాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top