రెండో రౌండ్‌లో సాయి శ్రేయ | In the second round of the Sai Shreya | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో సాయి శ్రేయ

Nov 1 2013 12:09 AM | Updated on Jun 1 2018 8:52 PM

ఏపీ సబ్ జూనియర్ అండర్-13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హెదరాబాద్‌కు చెందిన సాయి శ్రేయ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

అనంతపురం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ఏపీ సబ్ జూనియర్ అండర్-13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హెదరాబాద్‌కు చెందిన సాయి శ్రేయ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఇక్కడి డీపీఓ ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన టోర్నీ మొదటి రౌండ్‌లో శ్రేయ 21-8, 21-14తో లహరి (చిత్తూరు)పై విజయం సాధించింది. మరోవైపు శ్వేత (హైదరాబాద్) 15-21, 19-21తో కేయూర (రంగారెడ్డి) చేతిలో ఓటమిపాలైంది. రంగారెడ్డి క్రీడాకారిణులు భార్గవి, అభిలాష కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తొలి రౌండ్‌లో భార్గవి 21-8, 21-9తో హర్షిత వర్మ (మెదక్)పై, అభిలాష 21-7, 21-6తో స్ఫూర్తి (నెల్లూరు)పై గెలుపొందారు. బాలుర విభాగం మొదటి రౌండ్‌లో హైదరాబాద్ క్రీడాకారులు స్వరూప్, కీర్తి శశాంక్, మనీశ్ కుమార్ పరాజయం పాలయ్యారు.
 
  స్వరూప్ 11-21, 27-25, 17-21తో సాయి చరణ్ (గుంటూరు) చేతిలో, కీర్తి శశాంక్ 15-21, 23-25తో వర్షాంత్ (మెదక్) చేతిలో, మనీష్ కుమార్ 13-21, 10-21తో ప్రసాద్ (కరీంనగర్) చేతిలో పరాజయం పొందారు.  అంతకు ముందు జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేశ్ కుమార్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ టోర్నీలో వివిధ జిల్లాలకు చెందిన 250 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తల్లి సుబ్బారావమ్మను జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జొన్నా సత్యనారాయణ సన్మానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement