చాంపియన్ ఇంటికి... | In the pre quarter-finals, losing to Spain 2-0 Italy victory | Sakshi
Sakshi News home page

చాంపియన్ ఇంటికి...

Jun 28 2016 12:52 AM | Updated on Oct 2 2018 8:39 PM

చాంపియన్ ఇంటికి... - Sakshi

చాంపియన్ ఇంటికి...

యూరోకప్ ఫుట్‌బాల్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌కు చుక్కెదురయింది. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో 2-0తో.....

ప్రిక్వార్టర్స్‌లో ఓడిన స్పెయిన్  2-0తో ఇటలీ విజయం  యూరో కప్
 
పారిస్
: యూరోకప్ ఫుట్‌బాల్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌కు చుక్కెదురయింది. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో 2-0తో గెలిచిన ఇటలీ... 2012 ఫైనల్లో ఎదురైన దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 1994 అనంతరం స్పెయిన్‌ను ఇటలీ ఓడించడం ఇప్పుడే కావడం విశేషం.  చిలినీ (33), పెల్లే (90) జట్టు తరఫున గోల్స్ సాధించారు. శనివారం జరిగే క్వార్టర్స్‌లో ఇటలీ జట్టు జర్మనీతో ఆడుతుంది. మ్యాచ్ ఆరంభం నుంచే స్పెయిన్ గోల్‌పోస్టుపై ఇటలీ దాడులు చేసింది.

దీనికి ఫలితం 33వ నిమిషంలో దక్కింది. తమకు లభించిన ఫ్రీకిక్ ద్వారా ఎడర్ సంధించిన బంతి నేరుగా గోల్ కీపర్ చేతుల్లోకి వెళ్లినా తను పట్టు కోల్పోవడంతో చేజారింది. అయితే సమీపంలోనే ఉన్న డిఫెండర్ గియోర్గియో చిలినీ వెంటనే బంతిని నెట్‌లోకి పంపడంతో ఇటలీ సంబరాల్లో మునిగింది. ఓవరాల్‌గా ప్రథమార్ధంలో ఇటలీ పూర్తి ఆధిక్యం ప్రదర్శించినా స్పెయిన్ కీపర్ అప్రమత్తత కారణంగా పలు గోల్స్ అవకాశాలు విఫలమయ్యాయి. ద్వితీయార్ధంలోనూ ఇటలీ జోరు కొనసాగింది. 90వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ డార్మియాన్ ఇచ్చిన పాస్‌ను నేర్పుగా పెల్లే గోల్ చేయడంతో ఇటలీకి తిరుగులేని విజయం లభించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement