ఇప్పటికీ నేనే బాస్‌: గేల్‌ | Im still the Universe Boss, that will never change, Gayle | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ నేనే బాస్‌: గేల్‌

Feb 18 2019 10:41 AM | Updated on Feb 18 2019 10:45 AM

Im still the Universe Boss, that will never change, Gayle - Sakshi

ఆంటిగ్వా: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌.. వరల్డ్‌కప్‌ తర్వాత వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికైన గేల్‌ తనకు ప్రపంచకప్‌ చివరి వన్డే టోర్నీ అని పేర్కొన్నాడు. దీనిలో భాగంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన గేల్‌.. వరల్డ్‌ క్రికెట్‌లో తానే గ్రేట్‌ ప్లేయర్‌నంటూ తనదైన శైలిలో ముచ్చటించాడు. ‘ మీరు గొప్ప వ్యక్తిని చూస్తున్నారు. నేను వరల్డ్‌ క్రికెట్‌లో గొప్ప క్రికెటర్‌ని. ఇప్పటికీ నేనే యూనివర్శ్‌ బాస్‌ను. అది ఎప్పటికీ మారదు’ అని గేల్‌ పేర్కొన్నాడు.

వరల్డ్‌కప్ తర్వాత మీరు వన్డేల్లో కనిపించరా? అన్న ప‍్రశ్నకు గేల్‌ బదులిస్తూ.. ‘ నా వన్డే క్రికెట్‌ అనేది వరల్డ్‌కప్‌తో ముగుస్తుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. యువ క్రికెటర్లకు మార్గదర్శిలా ఉంటా. వారి ఆటను ఎంజాయ్‌ చేస్తూ తిలకిస్తా’ అని అన్నాడు. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌తో బుధవారం నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్‌పై గేల్‌ దృష్టి సారించాడు. ఇక్కడ సత్తాచాటడమే కాకుండా అదే ఫామ్‌ను వరల్డ్‌కప్‌లోనూ కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement