భారత్‌దే సిరీస్‌

ICC women's championship in india win - Sakshi

రెండో వన్డేలోనూ ఓడిన శ్రీలంక మహిళల జట్టు  

గాలె: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత జట్టు 2–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో మిథాలీ రాజ్‌ బృందం 7 పరుగుల తేడాతో గెలుపొందింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ సరిగ్గా 50 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మిథాలీ (121 బంతుల్లో 52; 4 ఫోర్లు), తాన్యా భాటియా (66 బంతుల్లో 68; 9 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం లంక 48.1 ఓవర్లలో 212 పరుగులకు పరిమితమైంది. మాన్సి జోషి, రాజేశ్వరి చెరో 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరుగనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top