మెరుగైన సాహా, రోహిత్, భువీ ర్యాంకులు | ICC Test rankings: Wriddhiman, Rohit, Bhuvneshwar take giant leaps | Sakshi
Sakshi News home page

మెరుగైన సాహా, రోహిత్, భువీ ర్యాంకులు

Oct 5 2016 12:10 AM | Updated on Sep 4 2017 4:09 PM

మెరుగైన సాహా, రోహిత్, భువీ ర్యాంకులు

మెరుగైన సాహా, రోహిత్, భువీ ర్యాంకులు

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా ఆడిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రోహిత్ శర్మ,

దుబాయ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా ఆడిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రోహిత్ శర్మ, పేసర్ భువనేశ్వర్‌ల ర్యాంకింగ్స్ మెరుగయ్యాయి. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్‌‌సలో సాహా 18 ర్యాంకులను మెరుగుపర్చుకుని 56వ స్థానానికి చేరాడు. ఇక రోహిత్ కూడా 14 స్థానాలను ఎగబాకి 38వ ర్యాంకులో ఉన్నాడు.

పుజారా 15వ ర్యాంకులో ఉండగా.. మురళీ విజయ్ ఐదు స్థానాలు దిగజారి 21వ ర్యాంకుకు చేరాడు. స్టీవ్ స్మిత్ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ తొమ్మిది స్థానాలను మెరుగుపర్చుకుని 26వ ర్యాంకుకు చేరాడు. అశ్విన్ రెండు నుంచి మూడో ర్యాంకుకు చేరాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement