ఉమేష్ అంటే నాకెంతో ఇష్టం: స్టెయిన్ | I am a big fan of Umesh Yadav, says Dale Steyn | Sakshi
Sakshi News home page

ఉమేష్ అంటే నాకెంతో ఇష్టం: స్టెయిన్

Apr 7 2015 2:45 PM | Updated on Sep 2 2017 11:59 PM

ఉమేష్ అంటే నాకెంతో ఇష్టం: స్టెయిన్

ఉమేష్ అంటే నాకెంతో ఇష్టం: స్టెయిన్

టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ కు తాను పెద్ద ఫ్యాన్ అని ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు.

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ కు తాను పెద్ద ఫ్యాన్ అని ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో ఉమేష్ అగ్రబౌలర్ గా ఎదుగుతాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు ఉమేష్ ను తనతో పోల్చుకున్నాడు.

'ఉమేష్ కు నేను పెద్ద అభిమానిని. ఫాస్ట్ బౌలర్లు అంటే నాకు ఇష్టం. ఉమేష్, నేనూ ఒకేలా ఉంటాం. మా ఇద్దరీ హైట్ సమానం. అతడు నాకంటే స్ట్రాంగ్ గా ఉంటాడు. అతడి బౌలింగ్ యాక్షన్ కూడా శక్తివంతంగా ఉంటుంది. బంతిని స్వింగ్ అతడు చేయగలడు' అని స్టెయిన్ అన్నాడు.

ఐపీఎల్-8లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమేష్ యాదవ్ 12 టెస్టులు, 48 వన్డేలు ఆడాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ లో 18 వికెట్లు పడగొట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement