ఆంధ్రపై హైదరాబాద్ గెలుపు | hyderabad won carrom championship against with andhra | Sakshi
Sakshi News home page

ఆంధ్రపై హైదరాబాద్ గెలుపు

May 31 2014 12:44 AM | Updated on Sep 4 2018 5:07 PM

సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి.

సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్
 సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. కొంపల్లిలోని శివ శివాని ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం ప్రారంభమైన ఈ పోటీల టీమ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు తొలి రౌండ్‌లో ఆంధ్ర జట్లపై గెలుపొందగా, రెండో రౌండ్‌లో పురుషుల జట్టు కర్ణాటక చేతిలో ఓటమి పాలైంది. ఆంధ్రతో జరిగిన పురుషుల తొలి రౌండ్‌లో రవిందర్ గౌడ్ 25-0, 25-4తో మనోహర్‌పై, నవీన్ 25-0, 18-21, 25-4తో రమణపై గెలిచి హైదరాబాద్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించారు.
 
 అయితే డబుల్స్‌లో ఎస్.సాయిబాబా-యు.నరేశ్ జోడి 10-25, 5-23తో వై.శ్రీనివాసరావు-టి.సురేశ్ జంట చేతిలో ఓటమి పాలవడంతో హైదరాబాద్ ఆధిక్యం 2-1కి తగ్గింది. అనంతరం కర్ణాటకతో జరిగిన రెండో రౌండ్‌లో హైదరాబాద్ 1-2తో ఓడింది. ఇక మహిళల తొలిరౌండ్ పోటీల్లో హైదరాబాద్ 2-1తో ఆంధ్రను ఓడించింది.
 
 జి.మాధవి 0-25, 7-22తో రాజ్యలక్ష్మి చేతిలో ఓడినా, సవితా దేవి 25-0, 25-0తో మాధురిపై, పద్మజ-శ్వేత జోడి 25-0, 25-1తో జ్యోత్స్నా రవళి-శ్రావణి జంటను ఓడించడంతో హైదరాబాద్ గెలుపొందింది. మహిళల తొలి రౌండ్‌లోని ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడు 3-0తో పాండిచ్చేరిపై, కర్ణాటక 3-0తో ఆంధ్రపై విజయం సాధించాయి. పురుషుల తొలి రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడు 3-0తో పాండిచ్చేరిపై, కర్ణాటక 2-1తో కేరళపై గెలుపొందాయి.
 
 ఇక పురుషుల రెండో రౌండ్‌లో తమిళనాడు 3-0తో ఆంధ్రపై, కేరళ 2-1తో పాండిచ్చేరిపై గెలుపొందాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ సీహెచ్.మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, శివ శివాని ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఆరతి సంపతి, అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్.కె.శర్మ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement