breaking news
south zone carrom championship
-
హైదరాబాద్‌కు రెండు కాంస్యాలు
సౌత్‌జోన్ క్యారమ్ చాంప్ కర్ణాటక సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు కాంస్యంతో సరిపెట్టుకున్నాయి. పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడుకు కర్ణాటక చేతిలో చుక్కెదురైంది. ఆడిన ఐదు లీగ్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం ద్వారా కర్ణాటక చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కర్ణాటక 2-1తో తమిళనాడుపై గెలిచింది. తొలి సింగిల్స్‌లో జహీర్ పాషా (కర్ణాటక) 23-12, 19-13తో రాధాకృష్ణన్ (తమిళనాడు)పై, రెండో సింగిల్స్‌లో రాజేశ్ (కర్ణాటక) 25-10, 25-15తో భారతీదాసన్ (తమిళనాడు)పై విజయం సాధించారు. డబుల్స్‌లో మాత్రం తమిళనాడు జోడి సాగయ్య భారతి-శక్తివేలు 25-15, 25-15తో శివకుమార్-చంద్రశేఖర్ (కర్ణాటక) జంటపై గెలిచింది. ఓవరాల్‌గా పది పాయింట్లతో కర్ణాటక చాంపియన్‌షిప్ గెలువగా, 8 పాయింట్లతో తమిళనాడు రన్నరప్‌గా నిలిచింది. పురుషుల, మహిళల విభాగాల్లో హైదరాబాద్ జట్లు 6 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నాయి. మహిళల ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు (10 పాయింట్లు) టైటిల్ నిలబెట్టుకుంది. ఇందులో కర్ణాటక (8) రజతం గెలిచింది. -
ఆంధ్రపై హైదరాబాద్ గెలుపు
సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. కొంపల్లిలోని శివ శివాని ఇన్స్టిట్యూట్లో శుక్రవారం ప్రారంభమైన ఈ పోటీల టీమ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు తొలి రౌండ్లో ఆంధ్ర జట్లపై గెలుపొందగా, రెండో రౌండ్లో పురుషుల జట్టు కర్ణాటక చేతిలో ఓటమి పాలైంది. ఆంధ్రతో జరిగిన పురుషుల తొలి రౌండ్లో రవిందర్ గౌడ్ 25-0, 25-4తో మనోహర్‌పై, నవీన్ 25-0, 18-21, 25-4తో రమణపై గెలిచి హైదరాబాద్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించారు. అయితే డబుల్స్‌లో ఎస్.సాయిబాబా-యు.నరేశ్ జోడి 10-25, 5-23తో వై.శ్రీనివాసరావు-టి.సురేశ్ జంట చేతిలో ఓటమి పాలవడంతో హైదరాబాద్ ఆధిక్యం 2-1కి తగ్గింది. అనంతరం కర్ణాటకతో జరిగిన రెండో రౌండ్లో హైదరాబాద్ 1-2తో ఓడింది. ఇక మహిళల తొలిరౌండ్ పోటీల్లో హైదరాబాద్ 2-1తో ఆంధ్రను ఓడించింది. జి.మాధవి 0-25, 7-22తో రాజ్యలక్ష్మి చేతిలో ఓడినా, సవితా దేవి 25-0, 25-0తో మాధురిపై, పద్మజ-శ్వేత జోడి 25-0, 25-1తో జ్యోత్స్నా రవళి-శ్రావణి జంటను ఓడించడంతో హైదరాబాద్ గెలుపొందింది. మహిళల తొలి రౌండ్‌లోని ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడు 3-0తో పాండిచ్చేరిపై, కర్ణాటక 3-0తో ఆంధ్రపై విజయం సాధించాయి. పురుషుల తొలి రౌండ్లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడు 3-0తో పాండిచ్చేరిపై, కర్ణాటక 2-1తో కేరళపై గెలుపొందాయి. ఇక పురుషుల రెండో రౌండ్లో తమిళనాడు 3-0తో ఆంధ్రపై, కేరళ 2-1తో పాండిచ్చేరిపై గెలుపొందాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ సీహెచ్.మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, శివ శివాని ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఆరతి సంపతి, అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్.కె.శర్మ పాల్గొన్నారు.