సెమీస్‌లో హైదరాబాద్‌ థండర్‌బోల్ట్స్‌ | Hyderabad thunderbolts enter semis in t20 cricket league | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో హైదరాబాద్‌ థండర్‌బోల్ట్స్‌

Feb 23 2018 10:25 AM | Updated on Sep 4 2018 5:07 PM

Hyderabad thunderbolts enter semis in t20 cricket league - Sakshi

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకుంటున్న మీర్‌ జావిద్‌ అలీ

సాక్షి, హైదరాబాద్‌: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్‌ లీగ్‌లో హైదరాబాద్‌ థండర్‌బోల్ట్స్‌ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. జింఖానా మైదానంలో గురువారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 34 పరుగుల తేడాతో ఎంఎల్‌ఆర్‌ రాయల్స్‌ మహబూబ్‌నగర్‌పై ఘన విజయాన్ని సాధించింది. ఇది హైదరాబాద్‌కు వరుసగా ఎనిమిదో విజయం. లీగ్‌ దశలో తొమ్మిది మ్యాచ్‌లాడిన థండర్‌బోల్ట్స్‌ 16 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. 14 పాయింట్లతో రంగారెడ్డి రైజర్స్‌ రెండో స్థానానికి చేరగా... 12 పాయింట్లు సాధించిన ఆదిలాబాద్‌ టైగర్స్, మెదక్‌ మావెరిక్స్‌ జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకుని సెమీస్‌లో అడుగుపెట్టాయి.   

ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ చందన్‌ సహాని (43 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. ప్రిన్స్‌ (35; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం మహబూబ్‌నగర్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. కార్తీక్‌ ఆనంద్‌ (42; 4 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో జయరామ్‌ రెడ్డి, పుష్కర్‌ చెరో 2 వికెట్లు తీశారు. చందన్‌ సహానికి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇతర మ్యాచ్‌ల వివరాలు

ఆదిలాబాద్‌ టైగర్స్‌: 133/8 (మీర్‌ జావిద్‌ అలీ 52; త్రిషాంక్‌ గుప్తా 3/17), ఖమ్మం టిరా: 72 (ముకేశ్‌ 25; రవితేజ 2/19, హితేశ్‌ యాదవ్‌ 3/7). మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: మీర్‌ జావిద్‌ అలీ.

నిజామాబాద్‌ నైట్స్‌: 161/9 (అనురాగ్‌ హరిదాస్‌ 57; శ్రీకరణ్‌ 3/28), కరీంనగర్‌ వారియర్స్‌: 116 (అశ్విని బాబు 35; అనురాగ్‌ హరిదాస్‌ 3/22).  
నల్లగొండ లయన్స్‌: 157/6 (క్రితిక్‌ రెడ్డి 51, తేజోధర్‌ 36), కాకతీయ కింగ్స్‌: 109 (భానుప్రకాశ్‌ 32; తేజోధర్‌ 3/19). మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: క్రితిక్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement