నేటి నుంచి కౌంటర్లలో...

Hyderabad One Day Ticket Sales - Sakshi

హైదరాబాద్‌ వన్డే టికెట్ల అమ్మకాలు

సాక్షి, హైదరాబాద్‌: మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరిగే తొలి వన్డే కోసం నేటి నుంచి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నేరుగా కౌంటర్లలో టికెట్లు అమ్మనుంది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్‌ టికెట్లు కొనుగోలు చేయవచ్చు.  మరోవైపు ఈనెల 11 నుంచే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండగా... ఇప్పటికే కొన్నవారు 23 నుంచి జింఖానా మైదానంలోనే వాటిని ‘రిడీమ్‌’ చేసుకొని అసలు టికెట్లను పొందవచ్చని హెచ్‌సీఏ పేర్కొంది.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top