
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’గా ముగించారు. జొలాంటా జవద్జా్క (పోలాండ్)తో జరిగిన గేమ్‌ను నల్ల పావులతో ఆడిన కోనేరు హంపి 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.
బేలా ఖొటెనాష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను నల్ల పావులతో ఆడిన హారిక 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. నేడు జరిగే రెండో గేమ్‌లో గెలిచిన వారు మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ రెండో గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం గురువారం టైబ్రేక్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.