హెచ్‌పీఎస్, శ్రీనిధి జట్ల శుభారంభం | hps, sreenidhi won opener matches | Sakshi
Sakshi News home page

హెచ్‌పీఎస్, శ్రీనిధి జట్ల శుభారంభం

Nov 12 2016 10:21 AM | Updated on Sep 4 2017 7:55 PM

వీవీఎస్ కప్ అండర్-14 ఇంటర్‌స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హెచ్‌పీఎస్ రామంతపూర్ జట్లు శుభారంభం చేశారుు.

సాక్షి, హైదరాబాద్: వీవీఎస్ కప్ అండర్-14 ఇంటర్‌స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హెచ్‌పీఎస్ రామంతపూర్ జట్లు శుభారంభం చేశారుు. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ మైదానం వేదికగా శుక్రవారం హిల్‌సైడ్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీనిధి జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హిల్‌సైడ్ స్కూల్ 7.3 ఓవర్లలో 30 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో నిమిష్ 3 వికెట్లు దక్కించుకోగా... నితిన్ కేవలం 3 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీనిధి జట్టు 2.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31పరుగులు చేసి గెలిచింది.

 

4 వికెట్లతో రాణించిన నితిన్ సారుుకి బెస్ట్ ప్లేయర్ పురస్కారం లభించింది. మెరిడియన్ (మాదాపూర్)స్కూల్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హెచ్‌పీఎస్ రామంతపూర్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన మెరిడియన్ జట్టు 10.3 ఓవర్లలో 41 పరుగులకు ఆలౌటైంది. హెచ్‌పీఎస్ బౌలర్ బాలాజీ 4 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు. అనంతరం హెచ్‌పీఎస్ జట్టు 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసి గెలిచింది. ధనుశ్ (19 నాటౌట్), వ్యాస్ (14 నాటౌట్) రాణిం చారు. బౌలింగ్‌లో రాణించిన బాలాజీకి బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement